రాష్ట్రవ్యాప్తంగా 294 పునరావాస కేంద్రాల్లో వలస కార్మికులకు ఆశ్రయం : సమన్వయకర్త ఎం.టి.కృష్ణబాబు

  • స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో మరో 36 కేంద్రాలు
  • ఈ కేంద్రాల్లో వసతి, ఆహారం, వైద్య సదుపాయం
  • పలు కంపెనీల ఆధ్వర్యంలోనూ వసతి
లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోవడమేకాక ఎక్కడివారు అక్కడే చిక్కుకుని ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కార్మికుల అవస్థలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా 294 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర సమన్వకర్త, ఆర్‌అండ్‌బీ ముఖ్యకార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు తెలిపారు. నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కేంద్రాల్లో మొత్తం 17,475 మంది ఆశ్రయం పొందుతున్నారని చెప్పారు.

వీరికి ఆహారంతోపాటు వైద్య సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో స్వచ్ఛంద సంస్థలు మరో 36 కేంద్రాలు ఏర్పాటుచేసి 4,142 మందికి ఆశ్రయం కల్పిస్తున్నాయని వివరించారు. అలాగే, పలు కంపెనీలు తమ కార్మికుల కోసం ఆశ్రయాలను ఏర్పాటు చేశాయని, వీటిలో మరో 19,207 మందికి తక్షణ వసతి లభిస్తోందని వివరించారు.



More Telugu News