కరోనాను వైరస్ ను రెండు రోజుల్లోనే చంపేస్తున్న 'ఇవెర్ మెక్టిన్'!

  • ఆస్ట్రేలియా ప్రయోగశాలలో పరీక్షలు
  • 48 గంటల్లోనే కరోనా ఆర్ఎన్ఏ హతం
  • వెల్లడించిన శాస్త్రవేత్త కైలీ వాగ్ స్టాఫ్
శరీరంలో తిష్ట వేసుకుని ఉన్న కరోనా వైరస్ ను 'ఇవెర్ మెక్టిన్' కేవలం 48 గంటల్లో చంపేస్తోందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ యాంటీ వైరల్ ఔషధం ఇప్పటికే అందుబాటులో ఉందని, దీంతోనే శరీరంలోని వైరస్ ను అంతం చేయవచ్చని వెల్లడించారు. ప్రస్తుతం హెచ్ఐవీ, డెంగీ, జికా, ఇన్ ఫ్లూయెంజా తదితర ఎన్నో రకాల వైరస్ ఇన్ ఫెక్షన్లకు చికిత్స చేసేందుకు ఇవెర్ మెక్టిన్ ను వాడుతున్నారని గుర్తు చేశారు.

ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్త కైలీ వాగ్ స్టాఫ్ నాయకత్వంలోని బృందం కరోనా వైరస్ పై ప్రయోగశాలలో ఈ యాంటీ వైరల్ ను ప్రయోగించి విజయవంతం అయింది. ప్రయోగశాలలో అభివృద్ధి చేసిన వైరస్ పై ఇది సమర్థవంతంగా పనిచేసిందని, ఇక, మానవులపై పరీక్షించాల్సి వుందని కైలీ వ్యాఖ్యానించారు. కేవలం ఒక్క డోస్ తో వైరస్ కు చెందిన ఆర్ఎన్ఏ ను రెండు రోజుల్లో పూర్తిగా నిర్మూలించామని, 24 గంటల్లోనే వైరస్ స్థాయి గణనీయంగా పడిపోయిందని వ్యాఖ్యానించారు.


More Telugu News