బివేర్ ఆఫ్ సాల్ట్! శరీరానికి రోజుకు ఐదు గ్రాముల ఉప్పు చాలు: పరిశోధకులు
- ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి సన్నగిల్లుతుంది
- అవయవాల పనితీరు దెబ్బతింటుంది
- హెచ్చరిస్తున్న జర్మన్ పరిశోధకులు
సరిపడా ఉప్పులేని ఆహార పదార్థాలను తినడం కొంచెం కష్టమే అయినా అలా తినడాన్ని అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు పరిశోధకులు. ఉప్పును అధికంగా తీసుకోవడం వల్ల రక్తపోటు పెరగడంతోపాటు రోగనిరోధక శక్తి దెబ్బతింటుందని జర్మనీలోని బాన్ యూనివర్సిటీ నిర్వహించిన తాజా పరిశోధనల్లో తేలింది. మోతాదుకు మించి ఉప్పు తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ల ముప్పు కూడా ఎక్కువేనని హెచ్చరించారు.
కొన్ని రకాల చర్మవ్యాధుల విషయంలో మాత్రం ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. అయితే, అదే సమయంలో ఇతర అవయవాల పనితీరును అది దెబ్బతీస్తుందని, కాబట్టి ఓ వ్యక్తి రోజుకు ఐదు గ్రాములకు మించి ఉప్పు తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు.