రకుల్ ఉదారత... లాక్ డౌన్ ముగిసేంతవరకూ 250 కుటుంబాలకు 2 పూటలా భోజనం!
- రకుల్ ఇంటికి దగ్గర్లో మురికివాడ
- నిత్యమూ ఆహారం పంపుతున్న హీరోయిన్
- నెలాఖరు వరకూ అందిస్తానని వెల్లడి
అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్, లాక్ డౌన్ నేపథ్యంలో, తన ఉదారతను చాటుకుంది. న్యూఢిల్లీలోని తన ఇంటికి సమీపంలో ఉన్న మురికివాడలో తిండిలేక సతమతమవుతున్న 250 కుటుంబాలకు రెండు పూటలా భోజనాన్ని అందిస్తోంది. లాక్ డౌన్ ముగిసేంతవరకూ ఈ పేదలకు సాయం చేస్తానని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రకుల్ వ్యాఖ్యానించింది. ఆ మురికివాడలో ఎన్నో కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయని తన తండ్రి గుర్తించారని, వారికి తన ఇంటికి దగ్గర్లో ఆహారాన్ని తయారు చేయించి పంపిస్తున్నానని వెల్లడించింది.
లాక్ డౌన్ ను పొడిగిస్తే, ఈ సదుపాయాన్ని మరిన్ని రోజులు అందిస్తామని, ప్రస్తుతానికి ఈ నెలాఖరు వరకూ ఆహారం అందిస్తామని స్పష్టం చేసింది. దేశం విపత్కర పరిస్థితుల్లో ఉన్న వేళ, ప్రతి ఒక్కరూ సాయం చేయాలని సూచించింది. చాలా మందికి తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు ఉందని, అది వారి అదృష్టమనే చెప్పాలని వ్యాఖ్యానించిన రకుల్, పేదలు తృప్తిగా భోజనం చేస్తుంటే, వారి ముఖంలో కనిపించే చిరునవ్వు తనకు సంతోషాన్ని ఇస్తుందని, అందుకోసం తనవంతుగా చిన్న సాయం చేస్తున్నానని రకుల్ చెప్పుకొచ్చింది.