ఇది కూడా కరోనా ఎఫెక్టే... జలంధర్ వాసులకు చేరువైన హిమాలయాలు!
- దేశవ్యాప్తంగా లాక్ డౌన్
- రహదారులపై కనిపించని వాహనాలు
- స్వచ్ఛమైన గాలి
- ప్రజలకు కనిపిస్తున్న పర్వత శ్రేణులు
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతుండగా, పర్యావరణంపై మాత్రం సానుకూల ప్రభావమే కనిపిస్తోంది. దేశం ఆర్థికంగా నష్టపోయి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేళ, రహదారులపై వాహన రద్దీ లేక, కాలుష్య కారకాలు కనిష్ఠానికి పడిపోయాయి. గాలి స్వచ్ఛభరితమైంది. దీంతో పంజాబ్ లోని జలంధర్ వాసులకు హిమాలయ పర్వతాలు కనిపిస్తున్నాయి.
జలంధర్ కు హిమాలయ పర్వత శ్రేణులు పక్కనే ఉన్నా, వాయు కాలుష్యం కారణంగా పర్వతాలు ఎన్నడూ కనిపించింది లేదు. ప్రస్తుతం గాలి పరిశుభ్రంగా మారడంతో, పర్వతాలు పక్కనే ఉన్నట్టు కనిపిస్తుండగా, ప్రజలు మేడలు, మిద్దెలు ఎక్కి, గంటల తరబడి తెల్లగా మెరిసిపోతున్న హిమాలయాలను చూసి సేదదీరుతున్నారు.