దళారుల మాటలు నమ్మి రైతులు మోసపోవద్దు: ఏపీ మంత్రి మోపిదేవి

  • ఆక్వా రంగాన్ని ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న మంత్రి
  • గిట్టుబాటు ధరలు కల్పిస్తామని సాగుదారులకు హామీ
  • ధరలు తగ్గిస్తే ఎగుమతిదారుల లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరిక
రాష్ట్రంలో కరోనా ప్రభావంతో లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రైతులకు అండగా నిలిచేందుకు తమ ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని, పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని ఏపీ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. ఆక్వా రంగాన్ని ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని, దళారుల మాటలు నమ్మి రైతులు మోసపోవద్దని సూచించారు. ధరలు తగ్గిస్తే ఎగుమతిదారుల లైసెన్స్ లు రద్దు చేస్తామని మంత్రి హెచ్చరించారు. ఆక్వా రైతుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఎంత సరుకు ఉన్నా దిగుమతి చేసుకోవడానికి పలు దేశాలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు.


More Telugu News