సరదాకి కూడా తప్పుడు సందేశాలు షేర్ చేయొద్దు: ఉద్ధవ్ థాకరే
- కరోనా వైరస్ లాగే మతోన్మాద వైరస్ కూడా ఉంది
- మార్గదర్శకాలను ప్రజలు ఏ మేరకు పాటిస్తున్నారనే దాన్ని గమనిస్తాం
- వారి మీదే లాక్‌డౌన్ పొడిగింపు అంశం ఆధారపడి ఉంటుంది
కరోనా విజృంభణ నేపథ్యంలో కొందరు సామాజిక మాధ్యమాల్లో కొన్ని తప్పుడు ప్రచారాలు చేస్తూ కలకలం రేపుతున్నారు. తమ వర్గం వారిలో భయం కలిగేలా చేస్తున్నారు. దీంతో వైద్య సిబ్బందిపై దాడుల వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటువంటి వాటిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే మండిపడి, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫేస్‌బుక్ లైవ్‌లో ఆయన మాట్లాడుతూ పలు విషయాలు తెలిపారు.
కరోనా వైరస్ లాగే మతోన్మాద వైరస్ కూడా ఉందని ఉద్ధవ్ థాకరే అన్నారు. సోషల్ మీడియాలో సరదాకి కూడా తప్పుడు సందేశాలు షేర్ చేయొద్దని ఆయన చెప్పారు. వాట్సప్‌లో, టిక్‌టాక్‌లో, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి మాధ్యమాల్లో పలు వీడియోలు, సందేశాలు వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనాకు మతం లేదని చెప్పారు. వైరస్ వ్యాపించకుండా సర్కారు జారీచేసిన మార్గదర్శకాలను ప్రజలు ఏ మేరకు పాటిస్తున్నారనే దాని మీదే లాక్‌డౌన్ పొడిగింపు అంశం ఆధారపడి ఉంటుందన్నారు.