కరోనాపై కలసి పోరు.. ట్రంప్‌తో మాట్లాడిన మోదీ!
- ట్విట్టర్‌లో తెలిపిన మోదీ
- ఫోనులో విస్తృతంగా సంభాషించాను
- భారత్-అమెరికా కలిసి పూర్తిస్థాయిలో పనిచేయాలని అంగీకారం
కరోనా విలయతాండవం చేస్తోన్న అమెరికాలో దుర్భర పరిస్థితులు కొనసాగుతున్నాయి. మరోవైపు భారత్‌లోనూ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. కరోనాను కట్టడి చేయడానికి ఇరు దేశాలు వేర్వేరుగా వ్యాక్సిన్, ఔషధాలను కనిపెట్టడానికి అనేక ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు ఫోనులో మాట్లాడుకున్నారు.
'అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఫోనులో విస్తృతంగా సంభాషించాను. ఇద్దరి మధ్య సహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయి. కొవిడ్-19ను కట్టడి చేయడానికి భారత్-అమెరికా కలిసి పూర్తిస్థాయిలో పనిచేయాలని అంగీకారానికి వచ్చాము' అని మోదీ ట్విట్టర్‌లో తెలిపారు.