ఏపీలో ఏడు గంటల వ్యవధిలో 10 మందికి కరోనా పాజిటివ్.. కృష్ణా జిల్లాలో మరింత పెరిగిన కేసులు
- ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు కరోనా కేసుల వివరాలు
- కృష్ణా జిల్లాలో కొత్తగా 5, గుంటూరులో 3
- ప్రకాశం, అనంతపూర్ జిల్లాలో ఒక్కొక్క కేసు
- 190 కి పెరిగిన కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు మరిన్ని పెరిగిపోయాయి. నిన్న రాత్రి 10.30 గంటల నుంచి ఈ రోజు ఉదయం 10 గంటల మధ్య కొత్తగా 16 కేసులు నమోదవడంతో అప్పటికి మొత్తం కేసులు 180కి చేరిన విషయం తెలిసిందే. ఇక ఈ రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు నమోదైన కరోనా కేసుల వివరాలను ప్రభుత్వం తాజాగా వెల్లడించింది.
కృష్ణా జిల్లాలో కొత్తగా 5, గుంటూరులో 3, ప్రకాశం, అనంతపూర్ జిల్లాలో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 10 కేసులతో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 190 కి పెరిగిందని ప్రభుత్వం వివరించింది. కృష్ణా, నెల్లూరులో అత్యధికంగా 32 కేసుల చొప్పున నమోదయ్యాయి.
ఏయే జిల్లాలో ఎన్నెన్ని కేసులు..?