ఆ సమయంలో నా పనైపోయిందని భావించాను: విరాట్ కోహ్లీ
- 2014 ఇంగ్లాండ్ టూర్ లో కోహ్లీ విఫలం
- పరుగులు చేయలేక సతమతం
- 2018లో సిరీస్ తొలి టెస్టులోనే సెంచరీ నమోదు
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆటతీరు గురించి ఎంత చెప్పినా తక్కువే. కచ్చితమైన టైమింగ్, తిరుగులేని టెక్నిక్ తో బౌలర్లను ఓ ఆటాడుకునే కోహ్లీ కెరీర్ లో 2014 ఇంగ్లాండ్ సిరీస్ మాత్రం ఓ చేదు జ్ఞాపకంలా మిగిలిపోతుంది. ఆ పర్యటనలో 10 ఇన్నింగ్స్ లాడిన కోహ్లీ 13.40 సగటు మాత్రమే నమోదు చేశాడంటే ఎవరూ నమ్మలేరు. అత్యధిక స్కోరు 39 పరుగులు మాత్రమే. మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ తో కోహ్లీ ఇన్ స్టాగ్రామ్ లైవ్ లో పాల్గొన్నాడు.
నాటి ఇంగ్లాండ్ పర్యటనపై కోహ్లీ స్పందిస్తూ, తన కెరీర్ లో అదొక దుర్భరమైన సమయం అని పేర్కొన్నాడు. ఎంత ప్రయత్నించినా పరుగులు చేయలేకపోవడంతో తన పనైపోయిందని భావించానని వెల్లడించాడు. బాగా ఆడి పరుగులు చేసే మార్గం తెలియక సతమతమయ్యానని, వరుసగా విఫలమవుతున్నాననే భావన నిత్యం తనను కాల్చుకుతినేదని తెలిపాడు. అయితే ఆ పర్యటన ముగిసిన నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఇంగ్లాండ్ వెళ్లిన కోహ్లీ ఈసారి మాత్రం బాగా రాణించాడు. 2018 పర్యటనలో తొలి టెస్టులోనే సెంచరీ బాది గత చేదు జ్ఞాపకాలను మరిపించేలా పరుగులు రాబట్టాడు.