ఈ ఔషధం మాకు ఆశాదీపంలా కనిపిస్తోంది: ట్రంప్
- హైడ్రాక్సీ క్లోరోక్విన్ పై ట్రంప్ నమ్మకం
- ఈ ఔషధంతో మంచి ఫలితాలు వస్తున్నాయని వెల్లడి
- భవిష్యత్ లో ఏం జరుగుతుందో చూద్దాం అంటూ వ్యాఖ్యలు
అగ్రరాజ్యం అమెరికా అభివృద్ధిలో అందరికీ ఆదర్శంగా నిలిచిన దేశం. కానీ ఇప్పుడు కరోనా చేత చిక్కి అత్యంత దయనీయ స్థితిలో విలవిల్లాడుతోంది. అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,77,985 కాగా, మరణాల సంఖ్య 7,146కి పెరిగింది. ముఖ్యంగా, న్యూయార్క్ ను ఈ వైరస్ భూతం హడలెత్తిస్తోంది.
ఈ నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా చికిత్సలో హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఔషధంతో మంచి ఫలితాలు వస్తున్నాయని, ఇప్పుడిదే తమకు ఊరట కలిగించే అంశంగా మారిందని తెలిపారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్ బాగా పనిచేస్తే కరోనా చికిత్సలో విశేషమైన ఫలితాలు వస్తాయని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. అయినా భవిష్యత్ లో ఏం జరుగుతుందో చూద్దాం అంటూ నిట్టూర్పు విడిచారు. ట్రంప్ కు ఇప్పుడు ఆశాదీపంలా కనిపిస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఔషధాన్ని ప్రధానంగా మలేరియా చికిత్సలో ఉపయోగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా చికిత్సలో ఇప్పుడు దీన్నే ఎక్కువగా వాడుతున్నారు.