సినీ కార్మికుల కోసం రూ.20 లక్షల విరాళం ప్రకటించిన నయనతార
- దేశవ్యాప్త లాక్ డౌన్ తో నిలిచిన షూటింగులు
- ఉపాధి లేక అల్లాడుతున్న సినీ కార్మికులు
- కార్మికుల పట్ల నయనతార సానుభూతి
సినీ కార్మికుల కోసం హీరోయిన్లు ఎవరూ స్పందించడంలేదన్న విమర్శల నేపథ్యంలో, ప్రముఖ నటి నయనతార తనవంతు విరాళం ప్రకటించింది. కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో ఎక్కడికక్కడ షూటింగులు నిలిచిపోయాయి. దాంతో సినీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు ఉపాధి కరవైంది. ఈ నేపథ్యంలో, దక్షిణాది సినీ కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ)కు నయనతార రూ.20 లక్షల విరాళం అందించింది. లాక్ డౌన్ కారణంగా చిత్ర పరిశ్రమ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. దాంతో చాలామంది కార్మికులు ఆకలితో అలమటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే పలువురు హీరోలు ఫెఫ్సీకి విరాళాలు ప్రకటించారు.