ఈ సమయంలో ఇసుక తవ్వకాలకు అనుమతి ఎందుకు ఇచ్చారు?: యనమల

  • లాక్‌డౌన్‌ ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
  • రైతుల వద్ద వెంటనే పంట ఉత్పత్తులు కొనుగోలు చేయాలి
  • ప్రతి పేద కుటుంబానికి రూ.5 వేల సాయం చేయాలి
  • వైద్య సిబ్బందికి మాస్కులు, రక్షణ పరికరాలు ఎందుకు కొనరు?
ఆంధ్రప్రదేశ్‌లో పెరిగిపోతోన్న కరోనా కేసులపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... లాక్‌డౌన్‌ ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. రైతుల వద్ద వెంటనే పంట ఉత్పత్తులు కొనుగోలు చేయాలని అన్నారు.

ప్రతి పేద కుటుంబానికి రూ.5 వేల సాయం చేయాలని యనమల డిమాండ్ చేశారు. కరోనా విజృంభిస్తోన్న సమయంలో ఇసుక తవ్వకాలకు ఎలా అనుమతులు ఇస్తారని ఆయన ప్రశ్నించారు. కరోనా నివారణ చర్యల్లో ఏపీ ప్రభుత్వం  విఫలమైందని విమర్శించారు. వైద్య సిబ్బందికి మాస్కులు, రక్షణ పరికరాలు ఎందుకు కొనరు? అని ప్రశ్నించారు. కేంద్ర నిబంధనలకు, లాక్‌డౌన్‌కు వైసీపీ నేతలే తూట్లు పొడుస్తున్నారని చెప్పారు.


More Telugu News