లాక్‌డౌన్ ఉల్లంఘిస్తున్నాడంటూ తండ్రిపై కుమారుడి ఫిర్యాదు!
- రోజూ బయట తిరుగుతున్నాడని పోలీసుల దృష్టికి
- ఢిల్లీ వసంత్ కుంజ్‌లో ఘటన
- ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు
కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్రం పటిష్ఠ చర్యలు తీసుకుంటోంది. 21 రోజుల లాక్‌డౌన్‌ను పక్కాగా అమలు చేస్తోంది. కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రజలెవరూ బయటికి రాకుండా ఆంక్షలు విధించాయి. బయటికి వెళ్తే ప్రమాదం అని తెలిసినా కొంత మంది పట్టించుకోవడం లేదు. ఇలా లాక్‌డౌన్ నిబంధనలు పట్టించుకోని ఓ వ్యక్తిపై అతని కొడుకే స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్ కుంజ్‌లో ఈ ఘటన జరిగింది.
రజోకరి ఏరియాలో నివాసం ఉంటున్న అభిషేక్ (30) ఓ ఆటోమొబైల్ కంపెనీలో పని చేస్తున్నాడు. లాక్‌డౌన్ నేపథ్యంలో అతని కుటుంబం అంతా ఇంటికే పరిమితమవగా..తండ్రి వీరేందర్ సింగ్ (59) మాత్రం బయట తిరుగుతున్నాడు. ఎంత చెప్పినా వినకపోవడంతో తన తండ్రి లాక్‌డౌన్ రూల్స్‌ను ఉల్లంఘించాడని చెబుతూ అభిషేక్ బుధవారం స్థానిక వసంత్ కుంజ్ సౌత్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దాంతో, వీరేందర్ పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.