నిర్మల్‌ జిల్లాలో కలకలం.. సర్వేకు వచ్చిన ఆశా కార్యకర్తలపై గుంపులుగా దాడికి యత్నం

  • వైఎస్సార్ కాలనీ, కాబూతర్ కాలనీలకు వెళ్లిన ఆశా కార్యకర్తలు
  • చంపేస్తామంటూ దూసుకువచ్చిన కుటుంబాలు 
  • ప్రాణ భయంతో కలెక్టర్‌ ఆఫీసుకి పరుగులు 
కరోనా విజృంభణ నేపథ్యంలో సేవలు అందిస్తోన్న వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలపై తెలంగాణలో దాడులు జరుగుతుండడం కలకలం రేపుతున్నాయి. మొన్న నిజామాబాద్‌లో దాడులు జరిగాయి.. నిన్న ఆదిలాబాద్‌లో జరిగాయి. ఈ రోజు నిర్మల్ జిల్లా కేంద్రంలో సర్వే చేస్తున్న ఆశా కార్యకర్తలపై దాడికి యత్నం జరిగింది. దీంతో ఆశా కార్యకర్తలు భయంతో పరుగులు తీశారు.

ఈ రోజు ఉదయం వైఎస్సార్ కాలనీ, కబూతర్ కాలనీల్లో ప్రజల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి వెళ్లిన ఆశా కార్యకర్తలపైకి అక్కడి ఓ వర్గం కుటుంబాలు కొన్ని గుంపులుగా దూసుకువచ్చాయి. దీంతో ప్రాణ భయంతో ఆశా కార్యకర్తలు అక్కడి నుంచి తప్పించుకుని కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. తమకు రక్షణ కల్పించాలని కోరారు. ఆ కుటుంబాలన్నీ కలిసి దాడిచేయడానికి వచ్చాయని, చంపేస్తామన్నారని వివరించారు.


More Telugu News