ఇవి కరోనా సోకని ప్రాంతాలు.. వెల్లడించిన హాప్ కిన్స్ వర్సిటీ డేటా!

  • అగ్రరాజ్యాలను సైతం హడలెత్తిస్తున్న కరోనా
  • అమెరికా, ఇటలీ, స్పెయిన్ వంటి అగ్రరాజ్యాల్లో కరోనా కల్లోలం
  • నౌరు, కిరిబాటి వంటి దేశాల్లో కనిపించని కరోనా
ప్రపంచంలో అత్యధిక దేశాలు కరోనా వైరస్ భూతంతో అవిశ్రాంతంగా పోరు సాగిస్తున్నాయి. ఎక్కడికి వెళ్లినా కరోనా ఉనికి ఉంటూనే ఉంది. అగ్రరాజ్యాలు అమెరికా, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్ సైతం ఈ మహమ్మారితో సతమతమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా కనిపించని ప్రాంతం ఏదైనా ఉంటే నిజంగా అక్కడి ప్రజలు అదృష్టవంతులే! అయితే, ఒకటి కాదు అనేక దేశాల్లో కరోనా లేదని జాన్ హాప్ కిన్స్ వర్సిటీ డేటా చెబుతోంది.

కొమోరోస్, కిరిబాటి, లెసోతో, మార్షల్ ఐలాండ్స్, మైక్రోనేషియా దీవులు, నౌరు, ఉత్తర కొరియా, పలావ్, సమోవా, సావో టోమ్ అండ్ ప్రిన్సిపె, సోలోమాన్ దీవులు, దక్షిణ సూడాన్, టోంగా, తుర్కెమెనిస్థాన్, టువాలు, వెనువాటు, యెమెన్ దేశాలు కరోనా రహిత దేశాలని హాప్ కిన్స్ వర్సిటీ పేర్కొంది. వీటిలో అత్యధిక దేశాలు పసిఫిక్ మహాసముద్రంలో అక్కడక్కడా విసిరేసినట్టుండే చిన్న చిన్న దీవులు. మరికొన్ని ఆఫ్రికా, ఆసియా దేశాలు కరోనా రహిత దేశాల జాబితాలో ఉన్నాయి. ఈ దేశాలకు ఇతర దేశాలతో పెద్దగా సంబంధాలు లేకపోవడం కరోనా అక్కడ ప్రవేశించకపోవడానికి ప్రధాన కారణం.


More Telugu News