వైద్యుల విధులకు ఆటంకాలు కలిగిస్తే కఠిన చర్యలు: కేంద్రం
- దేశంలో పలుచోట్ల వైద్యసిబ్బందిపై దాడులు
- రాష్ట్రాలకు లేఖ రాసిన కేంద్ర హోంశాఖ
- విదేశీ తబ్లిగీ జమాత్ లపై కేసులు
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో వైద్య సిబ్బంది పరిరక్షణకు కేంద్రం నడుం బిగించింది. అనేక ప్రాంతాల్లో వైద్యులపై దాడులు జరగడాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోంది. ఇకమీదట వైద్యుల విధులకు ఆటంకాలు కలిగిస్తే కఠినచర్యలు ఉంటాయని కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలకు లేఖలు పంపింది. తబ్లిగీ జమాత్ కారణంగా రెండ్రోజుల్లో 647 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. ఈ 647 కేసులను 14 రాష్ట్రాల్లో గుర్తించామని పేర్కొంది. 960 మంది విదేశీ తబ్లిగీ జమాత్ కార్యకర్తలపై చట్టపరమైన చర్యలు ఉంటాయని కేంద్రం స్పష్టం చేసింది. ఆరోగ్య ప్రోటోకాల్ పూర్తయ్యాకే వారి దేశాలకు పంపించే ఏర్పాట్లు చేస్తామని తెలిపింది.