అమెరికాలో లక్ష మృతదేహాల కోసం బాడీ బ్యాగులు కోరిన ఫెమా!

  • అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2.45 లక్షలు
  • 6 వేల మందికి పైగా మృతి
  • నిన్న ఒక్కరోజే 1100 మంది బలి
  • లక్ష బాడీ బ్యాగులు కావాలని సైన్యాన్ని కోరిన ఫెమా
చైనాలో పుట్టిన కరోనా వైరస్ భూతం ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికాను అతలాకుతలం చేస్తోంది. ఇప్పుడు అక్కడ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2.45 లక్షలు దాటింది. మరణాల సంఖ్య 6059గా నమోదైంది. తాజాగా, అమెరికా ప్రభుత్వానికి సంబంధించి ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. మృతదేహాలను ఉంచేందుకు లక్ష బాడీ బ్యాగులు కావాలంటూ ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్ మెంట్ ఏజెన్సీ (ఫెమా) అమెరికా సైనిక విభాగాన్ని కోరడం తీవ్ర కలకలం రేపుతోంది. పెంటగాన్ వర్గాలు కూడా దీన్ని ధ్రువీకరించాయి.

రానున్న మరికొన్ని వారాల్లో అమెరికాలో కరోనా స్వైరవిహారం చేస్తుందని, అపార జననష్టం తప్పదని భావిస్తున్నారు. నిన్న ఒక్కరోజే అమెరికాలో 1100 మందికి పైగా మృతి చెందడం అక్కడి పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చెబుతోంది. కరోనా బాధితుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుండడం పట్ల ఆందోళనతో ఉన్న వైట్ హౌస్ వర్గాలు, అమెరికాలో రెండు లక్షల మంది వరకు కరోనా మహమ్మారికి బలవుతారని అంచనా వేస్తున్నాయి.


More Telugu News