మక్కా, మదీనాల్లో కర్ఫ్యూ విధించిన సౌదీ అరేబియా
- సౌదీలో కరోనా బారిన పడి 20 మందికి పైగా మరణం
- మక్కా, మదీనాల్లో 24 గంటల కర్ఫ్యూ విధింపు
- ఇప్పటికే రద్దైన అంతర్జాతీయ విమాన సర్వీసులు
కరోనా మహమ్మారి ప్రపంచంలోని అన్ని దేశాలపైనా పంజా విసురుతోంది. ముస్లింలకు అత్యంత ప్రధానమైన సౌదీ అరేబియా కూడా ఈ మహమ్మారి దెబ్బకు వణికిపోతోంది. ఈ క్రమంలో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతాలైన మక్కా, మదీనాలో 24 గంటల పాటు కర్ఫ్యూ విధించింది.
అంతేకాదు, ఈ ప్రాంతాల్లో తిరిగే కార్లలో కేవలం ఒక వ్యక్తి మాత్రమే ప్రయాణించాలని ఆదేశించింది. సౌదీలో ఇప్పటి వరకు దాదాపు 2 వేల మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 20 మందికి పైగా మరణించారు. దీంతో, కరోనాను కట్టడి చేసేందుకు ఆ దేశం లాక్ డౌన్ విధించింది. అంతర్జాతీయ విమాన సేవలను రద్దు చేసింది. ఇతర దేశాల ప్రజలు మక్కా, మదీనా కోసం ఎలాంటి బుకింగ్స్ చేసుకోవద్దని ఇప్పటికే విన్నవించింది.