కరోనా వ్యాప్తి కట్టడికి బాలయ్య విరాళం రూ.1.25 కోట్లు.. చిరంజీవి ప్రశంసలు!

  • తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు రూ.50 లక్షల చొప్పున
  • కరోనా క్రైసిస్‌ ఛారిటీకి రూ.25 లక్షలు 
  • 'ప్రియ సోదరుడా, కృతజ్ఞతలు' అన్న చిరంజీవి  
కరోనా వ్యాప్తి కట్టడికి టీడీపీ ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ  తన వంతు సాయాన్ని అందించారు. మొత్తం రూ.1.25 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకు రూ.50 లక్షల చొప్పున కేటాయించారు.

సినీనటుడు చిరంజీవి నేతృత్వంలో ఏర్పాటైన కరోనా క్రైసిస్ ఛారిటీకి రూ.25 లక్షలు అందించారు. సీసీసీ కార్యనిర్వాహక సభ్యుడు సీ కల్యాణ్‌కు ఈ రూ.25 లక్షల చెక్‌ను బాలయ్య ఈ రోజు అందించారు. వీటిని సినీ కార్మికుల సంక్షేమం కోసం వినియోగిస్తారు.
బాలయ్యకు చిరు ప్రశంసలు 

భారీ విరాళాన్ని ప్రకటించిన బాలకృష్ణను చిరంజీవి ప్రశంసల్లో ముంచెత్తారు. "నా ప్రియమైన సోదరుడా, కృతజ్ఞతలు. సీసీసీకి రూ.25 లక్షలు, తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు రూ.50 లక్షల చొప్పున విరాళంగా ఇచ్చారు. అవసరం ఉన్న సమయాల్లో మీరు సాయం చేస్తూ మీ మంచి మనసుని చాటుకుంటుంటారు.  ప్రతి కష్ట సమయంలోనూ ప్రజలను ఆదుకోవటం కోసం సినీ పరిశ్రమ ఒక్కటిగా ముందుకొస్తే మీరు అన్ని వేళలా తోడుంటారు' అని ట్వీట్ చేశారు.

రూ.లక్ష ఇచ్చిన కన్నా..
కాగా, బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ కూడా తన వంతు సాయాన్ని అందించారు. 'నేను సైతం.. ప్రధాని మోదీ గారి పిలుపుతో నేడు నేను 1 లక్ష రూపాయలను పీఎం కేర్స్‌ కు విరాళం ఇచ్చాను. కరోనాపై పోరులో భాగంగా మీరు కూడా నేడు పీఎం కేర్స్‌కు మీ శక్తి కొద్దీ విరాళం ఇచ్చి,మరో 10 మందిని ఇచ్చేలా ప్రోత్సహించి కష్ట సమయంలో దేశానికి, ప్రధాని మోదీ గారికి నైతిక మద్దతు తెలుపుతారని ఆశిస్తున్నాను' అని ట్వీట్ చేశారు.


More Telugu News