కరీంనగర్‌లో నాలుగు కొత్త కేసులు...గాంధీ, కింగ్‌కోఠీ ఆసుపత్రులకు తరలింపు
- ఢిల్లీలోని మర్కజ్‌కు వెళ్లొచ్చిన ముగ్గురికి
- ఇండోనేషియా నుంచి వచ్చిన ఒకరికి
- వెల్లడించిన జిల్లా వైద్యాధికారి సుజాత
తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో కొత్తగా నాలుగు కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఇప్పటి వరకు జిల్లాలో 13 కేసులు నమోదు కాగా, వీటితో ఈ సంఖ్య 17కి చేరింది. వీరిలో 10 మంది ఇండోనేషియా వాసులే ఉన్నారు.
కొత్త కేసుల్లో ముగ్గురు ఇటీవల ఢిల్లీలో జరిగిన మత సమావేశాలకు హాజరైన వారు ఉండగా, మరొకరు ఇండోనేషియా వాసిగా గుర్తించినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి సుజాత తెలిపారు. బాధితులను హైదరాబాద్ లోని గాంధీ, కింగ్‌కోఠి ఆసుపత్రులకు పంపించినట్లు తెలిపారు. ఢిల్లీలో జరిగిన మత ప్రార్థనలకు కరీంనగర్ జిల్లా నుంచి మొత్తం 19 మంది హాజరయ్యారని గుర్తించామని, వీరిలో 11 మందికి నెగటివ్ వచ్చిందని తెలిపారు. మరో ఐదుగురి ల్యాబ్ రిపోర్టులు రావాల్సి ఉందన్నారు.