ఎయిమ్స్ డాక్టర్ భార్యకు కరోనా... నిండు గర్భిణి కావడంతో ప్రత్యేక జాగ్రత్తలు!
- కరోనా సోకిన వైద్యులకు చికిత్స అందించిన వైద్యుడు
- అతనికి పాజిటివ్ రావడంతో భార్యకూ పరీక్షలు
- వైరస్ సోకినట్టు నిర్ధారణ, ప్రత్యేక వార్డులో చికిత్స
ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్ లో కరోనా సోకిన వైద్యులకు చికిత్సను అందిస్తున్న వైద్యుడికి కరోనా పాజిటివ్ రాగా, ముందుజాగ్రత్తగా ఆయన భార్యకు చేసిన రక్త పరీక్షల్లోనూ పాజిటివ్ రిపోర్టు వచ్చింది. ఆమె 9 నెలల నిండు గర్భిణి కావడంతో వైద్యులు అప్రమత్తం అయ్యారు. ప్రస్తుతం ఆమెకు డెలివరీ సమయం దగ్గర పడటంతో ఎయిమ్స్ లోని ప్రత్యేక వార్డుకు తరలించారు. ఆమె ప్రాణాలకు ముప్పు లేదని ఎయిమ్స్ వైద్యులు ప్రకటించారు. బిడ్డకు కరోనా సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. కాగా, ఢిల్లీలో కరోనాకు చికిత్స చేస్తున్న ఆరుగురికి పాటిజివ్ రావడంతో, వారందరికీ ఐసోలేషన్ వార్డుల్లో చికిత్సను అందిస్తున్నారు.