కరోనాపై దుష్ప్రచారం చేస్తే రెండేళ్ల జైలు, జరిమానా: కేంద్రం హెచ్చరిక

  • లాక్‌డౌన్‌ను ఉల్లంఘించినా అదే శిక్ష
  • విపత్తు నిర్వహణ చట్టం, సెక్షన్ 188 కింద కేసులు
  • అన్ని రాష్ట్రాలకు కేంద్రం లేఖలు
దేశంలో అమలవుతున్న లాక్‌డౌన్ విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై లాక్‌డౌన్‌ను ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చినా, కరోనా వైరస్‌పై దుష్ప్రచారం చేసినా విపత్తు నిర్వహణ చట్టం-2005, భారత శిక్షాస్మృతి లోని సెక్షన్ 188లను ప్రయోగించాలని నిర్ణయించింది.

వీటి ప్రకారం ఎవరైనా లాక్‌డౌన్ ఉల్లంఘించినా, కరోనా విషయంలో దుష్ప్రచారానికి దిగినా రెండేళ్ల జైలు శిక్ష, జరిమానాను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇటువంటి వారిపై కేసులు నమోదు చేయాల్సిందిగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ సూచించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ సహాయ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు లేఖలు రాశారు.


More Telugu News