ఏపీ, తెలంగాణలో ఒక్క రోజే 65 కరోనా కేసుల నమోదు

  • ఏపీలో 38, తెలంగాణలో 27 కేసుల నమోదు
  • దేశవ్యాప్తంగా 2543కు పెరిగిన కేసులు
  • 72 మంది మృతి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. నిన్న ఒక్క రోజే రెండు రాష్ట్రాల్లోనూ కలిపి మొత్తం 65 కరోనా నిర్ధారిత కేసులు నమోదయ్యాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్‌లో 38, తెలంగాణలో 27 కేసులు ఉన్నాయి. తాజా కేసులతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 149కి పెరగ్గా, తెలంగాణలో 154కు చేరుకున్నాయి. తెలంగాణలో ఇప్పటి వరకు 9 మంది కరోనా బారినపడి మృతి చెందగా 17 మంది రోగులు కోలుకున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇక, దేశవ్యాప్తంగా 2543 కేసులు నమోదు కాగా, వీటిలో 2280 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 191 మంది రోగులు కోలుకోగా 72 మంది మృతి చెందారు.


More Telugu News