కరోనా ఔషధంగా ఎలుగుబంటి పైత్యరసం... మండిపడుతున్న జంతు హక్కుల ఉద్యమకారులు

  • చైనాను అతలాకుతలం చేసిన కరోనా
  • ఇప్పటికీ నమోదవుతున్న పాజిటివ్ కేసులు
  • క్లిష్ట పరిస్థితుల్లో ఎలుగుబంటి పైత్యరసం వాడొచ్చన్న చైనా
కరోనా మహమ్మారికి జన్మస్థానంగా నిలిచిన చైనాలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇప్పటికీ కొవిడ్-19 కేసులు నమోదువుతున్నా, కొన్ని వారాల కిందట ఉన్నంత తీవ్రత ఇప్పుడు లేదు. కాగా, చైనాలో ప్రస్తుతం ఓ ప్రాచీన ఔషధాన్ని కరోనా చికిత్సలో వినియోగిస్తున్నారు. కరోనా రోగి పరిస్థితి విషమంగా మారితే, ఆ రోగికి ఎలుగుబంటి పైత్యరసాన్ని ఔషధంగా వాడొచ్చని ఆదేశాలు జారీ చేసింది. చైనాలో పురాతన వైద్యవిధానంలో భాగంగా టాన్ రీ కింగ్ అనే ఔషధాన్ని క్లిష్ట పరిస్థితుల్లో వినియోగిస్తుంటారు.

ఎలుగుబంటి పైత్యరసం, మేక కొమ్ముల రసం, మరికొన్ని వనమూలికల రసం కలిపి మిశ్రమంగా రూపొందించినదే టాన్ రీ కింగ్ ఔషధం. ఎలుగుబంటి పైత్యరసాన్ని చైనాలో ఎప్పటినుంచో ఔషధంగా వినియోగిస్తున్నారు. అయితే కరోనా చికిత్సలో టాన్ రీ కింగ్ ఇంజెక్షన్లు వాడకానికి చైనా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల అక్కడి జంతు హక్కుల ఉద్యమకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలుగుబంట్ల మనుగడకు ఇలాంటి నిర్ణయాలతో ముప్పు పెరుగుతుందని వారు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు.


More Telugu News