ఇలాంటి ఘటనతో మంచి పోలీసులకు కూడా చెడ్డపేరు వస్తుంది: కేటీఆర్

  • వనపర్తిలో ఓ వ్యక్తిని కిందపడేసి లాఠీలతో బాదిన పోలీసులు
  • కేటీఆర్ కు వీడియో పంపిన ఓ పౌరుడు
  • విచారణ జరిపించాలంటూ హోంమంత్రికి స్పష్టం చేసిన కేటీఆర్
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో పోలీసులు రోడ్లపైకి వస్తున్న వారిపై లాఠీలు ఝుళిపించడం పరిపాటిగా మారింది. అయితే వనపర్తిలో కుమారుడితో కలిసి వెళుతున్న ఓ వ్యక్తిపై పోలీసులు విచక్షణ రహితంగా దాడి చేయడం పట్ల మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి ఘటనల వల్ల పోలీసు శాఖ మొత్తం అప్రదిష్ఠపాలవుతోందని, మంచి పోలీసులపైనా చెడు ముద్ర పడుతోందని అన్నారు.

ఎలాంటి పరిస్థితుల్లోనూ పోలీసులు ప్రజల పట్ల హేయమైన రీతిలో ప్రవర్తించరాదని హితవు పలికారు. వనపర్తి ఘటనపై విచారణ జరిపించాలని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డిలకు సూచించారు. వనపర్తిలో కొడుకుతో కలిసి వెళుతున్న వ్యక్తిని పోలీసులు కిందపడేసి చితకబాదగా, అక్కడే ఉన్న ఒకరు వీడియో తీశారు. ఆ వీడియోను మంత్రి కేటీఆర్ కు పంపడంతో, పోలీసుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.


More Telugu News