కరోనా నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోండి: వీడియో కాన్ఫరెన్స్‌లో మోదీని కోరిన జగన్
- అన్ని రాష్ట్రాల సీఎంలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్
- ఇప్పటివరకు 132 కేసులు నమోదయ్యాయన్న జగన్
- 111 మంది ఢిల్లీలో జరిగిన జమాత్‌తో సంబంధం ఉన్నవారేనని వ్యాఖ్య
- వైద్య పరికరాలను అందించాలన్న జగన్
కరోనా వ్యాప్తితో దేశ వ్యాప్తంగా ఏర్పడిన అసాధారణ పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా మోదీకి ఏపీ సీఎం జగన్ పలు వివరాలు తెలిపారు.
ఏపీలో రెండు రోజుల్లో కేసులు వేగంగా పెరిగిపోయిన తీరును వివరించారు. ఏపీలో ఇప్పటివరకు 132 కేసులు నమోదయ్యాయని, వారిలో 111 మంది ఢిల్లీలో జరిగిన జమాత్ సభకు వెళ్లిన వారు, వారితో సన్నిహితంగా ఉన్నవారేనని చెప్పారు. ఏపీలో కుటుంబాల వారీగా సర్వే చేస్తున్నామని తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్నవారిని క్వారంటైన్‌కు తరలిస్తున్నామని చెప్పారు. కాగా, ఏపీ ఆదాయం బాగా దెబ్బతిందని జగన్ తెలిపారు. రాష్ట్రాన్ని ఆదుకోవాలని ఆయన మోదీని కోరారు. కరోనా విజృంభణ నేపథ్యంలో వైద్య పరికరాలను అందించాలని చెప్పారు.