క్వారంటైన్‌ వార్డులో కరోనా అనుమానితుడి ఆత్మహత్య!

  • యూపీలో ఘటన
  • కరోనా లక్షణాలతో ఇటీవల క్వారంటైన్‌లో చేరిన వ్యక్తి
  • అతడి ఆత్మహత్యపై నివేదిక అందాల్సి ఉందన్న కలెక్టర్
కరోనాకు ఇంతవరకు మందు లేకపోయినా పలు చికిత్సా పద్ధతులతో చాలా మంది కోలుకుంటున్నారు. మన దేశంలో కరోనా కేసుల సంఖ్య 1965కి చేరగా, ఇప్పటివరకు వారిలో 151 మంది కోలుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగానూ దాదాపు రెండు లక్షల మంది కోలుకున్నారు. అయినప్పటికీ కొందరు కరోనా అంటే తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. కరోనా భయంతో ఆత్మహత్యలకు పాల్పడుతుండడం కలకలం రేపుతోంది.

ఉత్తరప్రదేశ్‌లోని షమ్లీ జిల్లాలోని ఆసుపత్రిలో ఉన్న క్వారంటైన్‌ వార్డులో కరోనా లక్షణాలతో చేరిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని ఆ జిల్లా కలెక్టర్ జస్జిత్ కౌర్ ప్రకటించారు. ఆ ఘటనపై తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. అతడి ఆత్మహత్యపై నివేదిక అందాల్సి ఉందని చెప్పారు. కాగా, కరోనా వచ్చిందన్న అనుమానంతో ఇటీవలే సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కరివిరాల గ్రామంలో శ్రీనివాస్‌ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. 


More Telugu News