ఆసుపత్రిలో కరోనా బాధిత మహిళ టిక్‌టాక్.. సహకరించిన ముగ్గురు పారిశుద్ధ్య సిబ్బందిపై వేటు

  • తమిళనాడులోని అరియలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన
  • ఆమె పట్టుబట్టడం వల్లే ఫోన్ ఇచ్చామన్న సిబ్బంది
  • సస్పెండ్ చేసి క్వారంటైన్‌కు తరలించిన అధికారులు
తమిళనాడులోని అరియలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగికి టిక్‌టాక్ చేయడంలో సహకరించిన ముగ్గురు పారిశుద్ధ్య సిబ్బందిపై అధికారులు వేటు వేశారు. బాధిత మహిళ టిక్‌టాక్ చేస్తుండగా వీరు ముగ్గురు దానిని సెల్‌ఫోన్‌లో రికార్డు చేశారు. అంతేకాకుండా ఆ తర్వాత ఆమెతో వీరు ముగ్గురు సెల్ఫీ దిగారు.

నిజానికి ఐసోలేషన్‌లోకి ఫోన్‌కు అనుమతి ఉండదు. అయితే, ఫోన్ కావాలని రోగి పట్టుబట్టడం వల్లే ఇచ్చామని సిబ్బంది పేర్కొన్నారు. మరోవైపు, ఫాలోవర్లు తనను మర్చిపోకుండా ఉండేందుకే టిక్‌టాక్ చేసినట్టు బాధిత మహిళ తెలిపింది. కాగా, పారిశుద్ధ్య సిబ్బంది ముగ్గురినీ విధుల నుంచి తొలగించిన అధికారులు వారిని క్వారంటైన్‌కు తరలించారు.


More Telugu News