పద్మశ్రీ అవార్డు గ్రహీత నిర్మల్ సింగ్‌ను బలితీసుకున్న కరోనా

  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని ఆసుపత్రిలో చేరిక
  • కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ 
  • ఈ తెల్లవారుజామున 4:30 గంటలకు కన్నుమూత
కరోనా వైరస్ మరో ప్రముఖుడి ప్రాణాలను బలితీసుకుంది. అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయ మాజీ హజూరీ రాగి, పద్మశ్రీ అవార్డు గ్రహీత నిర్మల్ సింగ్ ఖల్సా ఈ ఉదయం కన్నుమూశారు. ఆయనకు కరోనా వైరస్ సోకినట్టు బుధవారమే తేలింది. అంతలోనే ఈ తెల్లవారుజామున 4:30 గంటలకు ఆయన గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయాన్ని అమృత్‌సర్ సివిల్ సర్జన్ తెలిపారు.

పంజాబ్‌లో ఇది ఐదో మరణం కాగా, అమృత్‌సర్ జిల్లాలో మరణించిన తొలి వ్యక్తి ఖల్సాయే. అంతకుముందు హోషియార్‌పూర్‌కు చెందిన కరోనా పాజిటివ్ రోగి అమృత్‌సర్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. 62 ఏళ్ల ఖల్సా 2009లో పద్మశ్రీ పౌర పురస్కారాన్ని అందుకున్నారు. ఇటీవలే విదేశాల నుంచి వచ్చిన సింగ్.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడంతో మార్చి 30న గురునానక్ దేవ్ ఆసుపత్రిలో చేరారు.


More Telugu News