జోర్డాన్ ఎడారిలో చిక్కుకుపోయిన మలయాళ హీరో పృథ్వీరాజ్... ఆకలితో అలమటిస్తున్న చిత్ర యూనిట్!
- షూటింగ్ కోసం వెళ్లిన యూనిట్
- ఆపై లాక్ డౌన్ తో అక్కడే చిక్కుకుపోయిన పలువురు
- ఎలాగైనా ఇండియాకు తీసుకెళ్లాలని వినతి
కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచమంతా లాక్ డౌన్ అయిన వేళ, ఓ మలయాళ చిత్ర యూనిట్ షూటింగ్ నిమిత్తం జోర్డాన్ లోని ఎడారి ప్రాంతంలోకి వెళ్లి అక్కడ చిక్కుకుపోయింది. ఎటూ కదిలే దారి లేక, యూనిట్ మొత్తం ఆకలి బాధలు పడుతోందట. వారిని ఎలాగైనా వెనక్కు రప్పించాలని మాలీవుడ్ ప్రముఖులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
మరిన్ని వివరాల్లోకి వెళితే, స్టార్ హీరో పృథ్వీరాజ్ హీరోగా, బ్లెస్సీ దర్శకత్వంలో 'ఆడు జీవితం' పేరిట ఓ చిత్ర నిర్మాణం మొదలైంది. కథలో భాగంగా సినిమా షూటింగ్ ను జోర్డాన్ ఎడారిలో జరపాలని భావించారు. అక్కడి పరిస్థితులు బాగోలేవని కొందరు చెప్పినా, చిత్ర యూనిట్ వినలేదట. తీరా అక్కడికి వెళ్లిన తరువాత కరోనా తీవ్రరూపం దాల్చింది. ఇండియా లాక్ డౌన్ అయింది. విమానాలు వచ్చే పరిస్థితులు లేకపోవడంతో, వారంతా అక్కడే చిక్కుకుపోయారు. తిండి లేక నానా ఇబ్బంది పడుతున్నారట. తమను ఎలాగైనా ఇండియాకు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని యూనిట్ సభ్యులు కోరుతున్నారు.