‘కరోనా’పై పోరాడే క్రమంలో ఒకవేళ వైద్య సిబ్బంది మరణిస్తే కోటి రూపాయల నష్టపరిహారం: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
- ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగాలకు చెందిన వారికి ఇది వర్తిస్తుంది
- ఇలా నష్టపరిహారం ఇవ్వడమంటే వారి సేవలను గౌరవించడమే
- ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కేజ్రీవాల్
కరోనా వైరస్ బారినపడ్డ వారికి వైద్య సేవలందించే క్రమంలో ఒకవేళ సిబ్బంది ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి కోటి రూపాయలు నష్ట పరిహారం కింద చెల్లిస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించారు.
ఢిల్లీలో ఇవాళ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘కరోనా’ బాధితులకు చికిత్స అందించే క్రమంలో వైద్యులు, నర్సులు, పరిసరాల పరిశుభ్రతకు పాటుపడే పారిశుద్ధ్య సిబ్బంది కనుక మరణిస్తే వారి కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం ఇస్తామని చెప్పారు. ఈవిధంగా వారికి నష్టపరిహారం ఇవ్వడమంటే వారి సేవలను గౌరవించినట్టు అవుతుందని అన్నారు. ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగాలకు చెందిన ఉద్యోగులు ఎవరికైనా ఈ నష్టపరిహారం వర్తిస్తుందని చెప్పారు.
కాగా, ‘కరోనా’ బాధితులకు వైద్య సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి, పారా మెడికల్ సిబ్బందికి, టెక్నీషియన్స్ తో పాటు హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కు ఒక్కొక్కరికి రూ.50 లక్షల చొప్పున ప్రత్యేక ఇన్సూరెన్స్ ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన వెలువడ్డ కొన్ని రోజులకే సీఎం కేజ్రీవాల్ తాజా ప్రకటన చేయడం గమనార్హం.