మర్కజ్‌కు నేను వెళ్లలేదు.. ఆ ఛానల్‌పై పరువు నష్టం దావా వేస్తా: ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా
- మార్చి 2న ఢిల్లీకి వెళ్లాను
- ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ల కేసు విషయంపై మాత్రమే పర్యటన
- మార్చి 5 నుంచి 26 వరకు కడపలోనే ఉన్నాను
ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్‌లో జరిగిన ప్రార్థనల వల్ల చాలా మందికి కరోనా వైరస్ వ్యాధి సోకడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ప్రార్థనలకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా కూడా వెళ్లారని వస్తోన్న ఆరోపణలపై ఆయన స్పందించారు. మార్చి 2న ముస్లింలకు సంబంధించిన 4 శాతం రిజర్వేషన్ల కేసు విషయంపై మాత్రమే తాను ఢిల్లీ వెళ్లానని చెప్పారు. అనంతరం తాను మార్చి 5 నుంచి 26 వరకు కడపలోనే ఉన్నానని వివరించారు.
తాను మర్కజ్ ప్రార్థనలకు వెళ్లినట్లు మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. నిజాలు తెలుసుకోకుండా తనపై దుష్ప్రచారం చేసిన ఛానల్‌పై పరువునష్టం దావా వేస్తానని తెలిపారు. తాను ఆ సభలకు వెళ్లలేదని నిరూపించుకుంటే ఆ ఛానల్‌ను మూసేస్తారా? అని ప్రశ్నించారు.