పీఎం-కేర్స్‌కు మిట్టల్ గ్రూప్ భారీ విరాళం: రూ.100 కోట్లు ప్రకటన
- ఈ మేరకు ప్రకటన చేసిన లక్ష్మీనివాస్ మిట్టల్
- స్టీల్, హెచ్‌ఎంఈఎల్ సంస్థల తరపున వితరణ
- కష్టకాలంలో ప్రజలకు తోడుగా నిలవాల్సిన అవసరం ఉంది
కరోనా కట్టడికి పోరాడుతున్న భారత ప్రభుత్వానికి, ప్రజలకు ఈ కష్టకాలంలో అండగా నిలవాల్సిన అవసరాన్ని గుర్తించి తమ గ్రూపు తరపున వంద కోట్ల రూపాయల విరాళం పీఎం-కేర్స్‌కు అందజేయనున్నట్లు ప్రముఖ వ్యాపారవేత్త లక్ష్మీనివాస్‌మిట్టల్ వెల్లడించారు. తమ సంస్థలైన ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్, హెచ్‌ఎంఈఎల్ సంస్థల తరపున ఈ మొత్తాన్ని అందజేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే తమ సంస్థ రోజూ 35 వేల మందికి ఆహారం అందజేస్తోందని గుర్తు చేశారు. కోవిడ్19ను జయించేందుకు భారత ప్రజలు ఎనలేని తెగువతో పోరాడుతున్నారని, ఇటువంటి సమయంలో వారికి అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉందన్నారు.