చైనాపై కరోనా ఈ నెలాఖరులో మరోసారి దాడి చేసే అవకాశం ఉంది: శాస్త్రవేత్తలు
- చైనాకు కరోనా ముప్పు తప్పిపోలేదన్న హాంకాంగ్ శాస్త్రవేత్త
- ప్రజలకు చైనా మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించాలి
- కరోనా సోకిన వారిని రెండేళ్లు వేరుగా ఉంచాలి
చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచానికంతా విస్తరించి వేలాది మంది ప్రాణాలను బలిగొంటోంది. ఇదే సమయంలో ఆశ్చర్యకరంగా చైనాలో మాత్రం దాని ప్రభావం తగ్గిపోయింది. అయితే, చైనాకు కరోనా ముప్పు తప్పి పోలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
హాంకాంగ్ యూనివర్శిటీ ఎపిడెమియాలజిస్ట్ బెల్ కౌలింగ్ మాట్లాడుతూ, చైనాపై కరోనా మరోసారి దాడి చేయడం ఖాయంగా కనిపిస్తోందని చెప్పారు. ఈ నెల చివరికల్లా చైనాలో కరోనా మరోసారి పంజా విసురుతుందని తెలిపారు. కరోనాకు గురైన వారి నుంచి మిగిలిన వారిని సుమారు రెండేళ్ల పాటు వేరుగా ఉంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. అప్పుడే ఆయా దేశాలు కరోనా నుంచి తన ప్రజలను రక్షించుకోగలుగుతాయని తెలిపారు. మరోవైపు కరోనా బారిన పడిన వారు ఇంకా ఎంత మంది ఉన్నారో తెలుసుకోవడానికి... చైనా మరోసారి వైద్య పరీక్షలను నిర్వహించాలని సూచించారు.