లాక్ డౌన్ లోనూ శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికుడిపై డబ్బులు, పూల వర్షం... వీడియో ఇదిగో!
- కరోనా విస్తరిస్తున్నా విధులను విస్మరించని కార్మికుడు
- చెత్త తీసుకెళుతుంటే పూలవర్షం
- డబ్బుల దండలు వేసిన మరికొందరు
కరోనా వ్యాధి రోజురోజుకూ విస్తరిస్తున్న వేళ, తాను పని చేస్తున్న ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని శ్రమిస్తున్న ఓ పారిశుద్ధ్య కార్మికుడిపై పూలవరం కురిపించిన స్థానికులు, అతని మెడలో డబ్బుల హారాలను వేసి, అతని సేవలను కొనియాడారు. ఈ ఘటన పంజాబ్ లోని పటియాల జిల్లా నభా ప్రాంతంలో జరుగగా, ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
క్రమం తప్పకుండా తమ వీధిలోకి వచ్చి చెత్తను సేకరించే ఓ పారిశుద్ధ్య కార్మికుడు, లాక్ డౌన్ అమలులో ఉన్నా, తన విధులను మాత్రం విస్మరించలేదు. దీంతో అతనికి చప్పట్లతో స్వాగతం పలికిన ఓ కాలనీవాసులు, అతనిపై పూల వర్షం కురిపించారు. మరికొందరు కరెన్సీ దండలను తెచ్చి, అతని మెడలో వేసి అభినందించారు. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.