ఆడాళ్లను కష్టపెట్టొద్దు.. మమకారం చాటుకోండి: మగాళ్లకు నవీన్ పట్నాయక్ పిలుపు
- ఇదేమీ విందులు చేసుకునే సమయం కాదు
- వంటావార్పులతో మహిళలను కష్టపెట్టొద్దు
- వారు కుంగితే దేశం కుంగిపోతుంది
లాక్‌డౌన్ నేపథ్యంలో ఇంట్లోనే ఉంటున్న మగాళ్లు మహిళలను కష్టపెట్టకుండా, వారికి చేతనైనంత సాయం చేయాలని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పిలుపునిచ్చారు. వంటావార్పులతో మహిళలను ఉక్కిరిబిక్కిరి చేయొద్దని, ఎందుకంటే ఇది విందు, వినోదాలకు సమయం కాదని పేర్కొన్నారు. ఇంటిల్లిపాదీ ఆనందంగా గడపాల్సిన సమయం ఇదని, కాబట్టి వారికి సాయం చేస్తూ చేదోడువాదోడుగా నిలవాలని కోరారు.
లాక్‌డౌన్ నేపథ్యంలో మగాళ్లు ఇంట్లో కూర్చోవడం, మహిళలు మూడు నాలుగుసార్లు వంటింట్లో నలిగిపోవడం కాదని, వారిని వంటింటికే పరిమితం చేస్తే కుంగిపోతారని సీఎం అన్నారు. అదే జరిగితే వారితోపాటు దేశం కూడా కుంగిపోతుందని పేర్కొన్నారు. కాబట్టి మగాళ్లు ఓపిగ్గా మసలుకోవాలని, ఆహారాన్ని నియంత్రించుకోవాలని సూచించారు. వంటింటి వ్యవహారాల్లో పాలు పంచుకుని మగాళ్లు మమకారం చాటుకోవాలని నవీన్ పట్నాయక్ పిలుపునిచ్చారు.