మహిళలకు కష్టాలు తెచ్చిపెట్టిన లాక్‌డౌన్.. ఒక్కసారిగా పెరిగిన గృహ హింస కేసులు
- మార్చి 24 నుంచి ఇప్పటి వరకు 58 ఫిర్యాదులు
- పంజాబ్ నుంచే అత్యధికం
- భర్తలు తమ అసహనాన్ని భార్యలపై చూపిస్తున్నారంటున్న నిపుణులు
కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్‌డౌన్ మహిళలకు కష్టాలు తెచ్చిపెట్టిందా? గృహ హింసకు సంబంధించి జాతీయ మహిళా కమిషన్‌కు అందిన ఫిర్యాదులు చూస్తుంటే అవునని అనిపించకమానదు. మార్చి 24 నుంచి లాక్‌డౌన్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్‌సీడబ్ల్యూకి గృహ హింసకు సంబంధించి 58 ఫిర్యాదులు అందాయి. వీటిలో అత్యధికం ఉత్తరాది రాష్ట్రాల నుంచే కావడం గమనార్హం. ఇంట్లో ఉంటున్న పురుషులు తమ అసహనాన్ని భార్యలపై చూపిస్తూ హింసకు పాల్పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. తమకు అందిన ఫిర్యాదుల్లో ఎక్కువ శాతం పంజాబ్ నుంచే వచ్చినట్టు రేఖాశర్మ పేర్కొన్నారు. ఫిర్యాదులను పరిశీలిస్తున్నట్టు తెలిపారు.