ఏపీలో భయపెడుతున్న మహమ్మారి.. పశ్చిమ గోదావరిలో ఒక్క రోజులోనే 14 కరోనా కేసులు
- అత్యధికంగా ఏలూరులో ఆరు
- వివరాలు వెల్లడించిన కలెక్టర్
- రాష్ట్రంలో 58కి పెరిగిన కేసుల సంఖ్య
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భయపెడుతున్నాయి. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. ఒక్క రోజులోనే అక్కడ కేసుల సంఖ్య రెట్టింపవడం ఆందోళన కలిగిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో నిన్న ఒక్క రోజే ఏకంగా 14 కేసులు నమోదైనట్టు కలెక్టర్ రేవు ముత్యాలరాజు తెలిపారు.
వీటిలో ఏలూరులో 6, భీమవరం, పెనుగొండలలో చెరో రెండు, ఉండి, గుండుగొలను, ఆకివీడు, నారాయణపురంలో ఒక్కో కేసు చొప్పు నమోదైనట్టు ఆయన పేర్కొన్నారు. వీటితో కలిసి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 58కి పెరిగింది. జిల్లాలో మొత్తం 30 మందికి పరీక్షలు నిర్వహించగా 14 మందికి పాజిటివ్, మరో 10 మందికి నెగటివ్ రిపోర్టులు వచ్చాయని, ఆరుగురికి సంబంధించిన నివేదికలు రావాల్సి ఉందని కలెక్టర్ తెలిపారు.