పవన్ విజ్ఞప్తికి వెంటనే స్పందించిన సీఎం ఉద్ధవ్ థాకరే

  • కూలీలను తప్పకుండా ఆదుకుంటామని హామీ
  • ఎవరూ ఆందోళన చెందవద్దంటూ థాకరే భరోసా
  • మీరు సాయం చేస్తారన్న నమ్మకం ఉందంటూ పవన్ కృతజ్ఞతలు
ముంబయిలో చిక్కుకుపోయిన 500 వలస కూలీల కుటుంబాలను ఆదుకోవాలంటూ పవన్ కల్యాణ్ మహారాష్ట్ర సర్కారును అభ్యర్థించిన సంగతి తెలిసిందే. దీనిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే వెంటనే స్పందించారు.

'పవన్ గారూ, సంక్షోభ సమయంలో ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆదుకోవడం మన బాధ్యత. ఎవరూ ఆందోళన చెందనవసరంలేదు. వలస కార్మికుల కుటుంబాలను వెంటనే సంప్రదించి తగు చర్యలు తీసుకుంటాం' అని ఉద్ధవ్ హామీ ఇచ్చారు. దీనికి పవన్ కల్యాణ్ బదులిస్తూ మహారాష్ట్ర సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. మీరు సాయం చేస్తారన్న నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు.


More Telugu News