ప్రపంచవ్యాప్తంగా 38 వేలు దాటిన కరోనా మరణాలు... ఇటలీలో మరణమృదంగం!
- ఇటలీలో 11 వేలు దాటిన కరోనా మరణాలు
- స్పెయిన్ లో 8 వేల పైచిలుకు మరణాలు
- ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 8.01 లక్షలు
చైనాలోని వుహాన్ నగరంలో జన్మించిన కరోనా వైరస్ (కొవిడ్-19) ఇప్పుడు 200 దేశాలపై పంజా విసిరింది. ఇటలీ, స్పెయిన్ దేశాలు ఈ మహమ్మారి కబంధ హస్తాల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి. ఇటలీలో కరోనా వైరస్ ప్రభావంతో 11,591 మంది మరణించగా, స్పెయిన్ లో 8,189 మంది మృత్యువాత పడ్డారు. చైనాలో మృతుల సంఖ్య 3,305గా నమోదైంది. పాజిటివ్ కేసులు లక్ష దాటిన అమెరికాలో మరణాల రేటు తగ్గడం ఓ ఊరట. అమెరికాలో కరోనా మృతుల సంఖ్య 3,173.
ఇక, ఫ్రాన్స్ లోనూ కరోనా మృత్యుఘంటికలు మోగిస్తోంది. అక్కడ 3,024 మంది ప్రాణాలు కోల్పోగా, ఇరాన్ లో 2,898 మంది బలయ్యారు. బ్రిటన్ లో 1,408, నెదర్లాండ్స్ లో 864, జర్మనీలో 651 మంది మరణించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. కాగా, ప్రపంచవ్యాప్తంగా కరోనా సోకినవారి సంఖ్య 8.01 లక్షలకు చేరింది. కరోనాతో ఇప్పటివరకు ప్రపంచం మొత్తమ్మీద 38,749 మంది మరణించినట్టు గుర్తించారు.