వర్మ అంత మాట అనడంతో నాకు కన్నీళ్లు వచ్చేశాయి: కోన వెంకట్
- జీతం సరిపోవడం లేదని వర్మతో చెప్పాను
- కోపంతో బయటికి వెళ్లిపోయాను
- ఆయన కాల్ చేయలేదన్న కోన
రచయితగా రామ్ గోపాల్ వర్మ సినిమాలకి కోన వెంకట్ పనిచేశారు. తాజాగా ఆయన 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ, రామ్ గోపాల్ వర్మ గురించి ప్రస్తావించారు. "ఆర్ జీవి పేరులోనే వుంది .. ఆర్ అంటే రేర్ .. రేర్ జీవి అతను. హిట్స్ రానీ .. ఫ్లాప్స్ రాని ఎప్పుడూ ఒకేలా ఉంటాడు. లైఫ్ ను ఆయన చాలా ఈజీగా తీసుకుంటాడు. ఆర్జీవీ దగ్గర అప్పటికే నేను చాలా సినిమాలకి పనిచేశాను .. ఓ పదివేలు జీతం. ఆ జీతంలోనే నేను సర్దుకుంటూ ఇంటికి పంపించాలి.
ఒక రోజున నాకు జీతం సరిపోవడం లేదు అని చెప్పాను. అందుకు ఆయన 'నీ వలన కంపెనీకి ఎన్ని కోట్ల లాభం వచ్చిందో ఒక పేపర్ పై రాసి చూపించు' అన్నాడు. ఆయన అంత మాట అనేసరికి, ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తే ఇదా అనిపించి నా కళ్ల వెంట టపటపా కన్నీళ్లు వచ్చేశాయి.
ఇండియాలో టాప్ డైరెక్టర్ దగ్గర పనిచేస్తూ నేను ఒక పేదవాడిగా ఎందుకు ఉండాలి? అని అడిగాను. అలా అడగడం ఆయనకి నచ్చలేదు. నేను ఆయనను ఒక ఫ్రెండ్ గా భావిస్తూ వుంటే, ఆయన నన్ను అలా అనుకోవడం లేదేమో అనిపించింది. ఆయనకి చెప్పకుండానే అక్కడి నుంచి బయటికి వచ్చేశాను .. ఆ తరువాత ఆయన కనీసం కాల్ కూడా చేయలేదు" అని చెప్పుకొచ్చారు.