అనవసరంగా రోడ్లపైకి వస్తే జైలుకి పంపుతాం: తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి

  • ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండాలి
  • ప్రభుత్వం నిత్యావసరాల కొరత లేకుండా చూస్తోంది
  • గ్రామాల్లోని పరిస్థితులను ప్రజాప్రతినిధులు సమీక్షించాలి 
తెలంగాణలో విధించిన లాక్‌డౌన్‌ను అందరూ బాధ్యతగా పాటించాలని, నిబంధనలను ఉల్లంఘించి రోడ్లపైకి వస్తే జైలుకి పంపుతామని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండాలని చెప్పారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో ఆయన పర్యటించారు. తమిళనాడు నుంచి వలస వచ్చిన కార్మికులకు ఆయన నిత్యావసర సరుకులతో పాటు మాస్కులు, శానిటైజర్లు, కొంత నగదును ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు అనవసరంగా రోడ్లపైకి వస్తే జైల్లో పెట్టిస్తామని హెచ్చరించారు. లాక్‌డౌన్‌ సందర్భంగా ప్రభుత్వం అన్ని సదుపాయాలూ అందిస్తోందని, నిత్యావసరాల కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఇంట్లోంచి ఎవరూ బయటకు రావద్దని చెబుతూ, తాను చేతులెత్తి వేడుకుంటున్నానని వ్యాఖ్యానించారు. గ్రామాల్లోని పరిస్థితులను ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆయన ఆదేశించారు.


More Telugu News