కొడాలి నానిపై బుద్ధా వెంకన్న ఫైర్
- సొంత శాఖలో ఏం జరుగుతోందో కూడా సన్నబియ్యం మంత్రికి తెలియదు
- జనాలను క్యూ లైన్లలో నిలబెట్టి ప్రాణాలు తీస్తున్నారు
- అందుకే జనాలు చంద్రబాబు రావాలి అంటున్నారు
ఏపీ ముఖ్యమంత్రి జగన్, మంత్రి కొడాలి నానిలపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కరోనాను కట్టడి చేయడంలో జగన్ ఫెయిల్ అయ్యారని, ఆయనొక అసమర్థుడని సన్నబియ్యం మంత్రి స్వయంగా ఒప్పుకున్నారని పరోక్షంగా కొడాలి నానిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. అందుకే జనాలంతా చంద్రబాబు రావాలి, కావాలి అంటున్నారని చెప్పారు. కరోనాను కట్టడి చేయడానికి సరైన చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారని చెప్పారు.
సన్నబియ్యం మంత్రిని చూస్తుంటే బాధేస్తోందని... సొంత శాఖలో ఏం జరుగుతోందో కూడా తెలియని అసమర్థుడు ఆయన అని వెంకన్న ఎద్దేవా చేశారు. రేషన్ షాపుల్లో సరుకులు ఇస్తామని సంబంధిత శాఖ ప్రకటిస్తే... సన్నిబియ్యం మంత్రి మాత్రం ఇంటికే సరుకులు పంపుతా అని ప్రకటించారని అన్నారు. చివరకు ప్రజలను క్యూ లైన్లలో నిలబెట్టి ప్రాణాలు తీస్తున్న దుర్మార్గపు ప్రభుత్వం ఇదని మండిపడ్డారు.