కరోనా హెల్ప్ లైన్ తో ఆడుకున్న తుంటరి.. అతనితో మరుగుదొడ్లు శుభ్రం చేయించిన కలెక్టర్!
- చెప్పినా వినకుండా పదేపదే సమోసాల ఆర్డర్
- అందించి సామాజిక శిక్ష విధించిన కలెక్టర్
- సరైన పని చేశారంటూ నెటిజన్ల ప్రశంసలు
కరోనా వ్యాధి లక్షణాలు కనిపిస్తే, వెంటనే సమాచారం ఇవ్వాలంటూ, అధికారులు ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ తో ఆడుకున్న ఓ తుంటరికి ఆ ప్రాంత కలెక్టర్ వినూత్న శిక్షను విధించి, మొత్తం ఉదంతాన్ని సోషల్ మీడియాలో ఉంచగా, అదిప్పుడు వైరల్ అయింది. అతనికి సరైన శిక్షను విధించారని నెటిజన్లు అంటున్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే, ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ లో కరోనా హెల్ప్ లైన్ కు ఫోన్ చేసిన ఓ వ్యక్తి, తనకు నాలుగు సమోసాలు కావాలని కోరాడు. అధికారులు ఎంత చెప్పినా వినకుండా, పదే పదే ఫోన్ చేసి సమోసాలు అడుగుతూనే ఉన్నాడు. దీంతో విషయం తెలుసుకున్న రాంపూర్ జిల్లా కలెక్టర్ ఆంజనేయ కుమార్ సింగ్, అతనికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు.
సమోసాలు ఆర్డర్ చేస్తున్న ఆకతాయి ఇంటికి వాటిని తీసుకెళ్లి అందించారు. అనంతరం అసలు విషయం చెప్పారు. అధికారుల విధులను ఆటంకపరిచాడన్న ఆరోపణలపై మరుగుదొడ్లను శుభ్రం చేయాలంటూ, సామాజిక శిక్షను విధించారు. ఈ విషయాన్ని ఆంజనేయ కుమార్ సింగ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.