ప్రపంచ వ్యాప్తంగా మరిన్ని పెరిగిన కరోనా కేసులు.. మరణాలు

  • కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7.60 లక్షలు
  • ఇప్పటివరకు 36,862 మంది మృతి
  • ఇటలీలో 24 గంటల్లో 812 మంది మృతి
  • స్పెయిన్‌లో 537 మంది మృతి
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరిన్ని దేశాలకు వ్యాప్తి చెందింది. ఇప్పటివరకు 200 దేశాలకు పాకింది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7.60 లక్షలకు చేరింది. కరోనాతో ఇప్పటివరకు 36,862 మంది మృతి చెందారు. అత్యధికంగా ఐరోపా ఖండంలో 27 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా మరణాలు అత్యధికంగా నమోదవుతున్న ఇటలీలో 24 గంటల్లో మరో 812 మంది ప్రాణాలు కోల్పోయారు. స్పెయిన్‌లో 537 మంది మృతి చెందారు.

అమెరికాలో ఒక్క రోజులో దాదాపు 20,000 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ఆ దేశంలో 568 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ దేశంలో మృతి చెందిన వారి సంఖ్య 3,148కి చేరింది. ప్రాన్స్‌లోనూ ఒక్క రోజులో 418 మంది మృతి చెందగా, బ్రిటన్‌లో 180 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది.


More Telugu News