డీఎంకే అధినేత స్టాలిన్ రిక్వెస్ట్.. వెంటనే స్పందించిన కేటీఆర్!
- బాల్కొండలో చిక్కుకున్న తమిళనాడు వ్యాపారులు
- తిండి, ఆశ్రయం లేక ఇబ్బందులు పడుతున్నారని స్టాలిన్ ట్వీట్
- తన టీమ్ సమన్వయం చేసుకుంటుందన్న కేటీఆర్
డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ చేసిన ట్వీట్ పై తెలంగాణ మునిసిపల్, ఐటీ మంత్రి కేటీఆర్ ఆరంటే ఆరు నిమిషాల్లో స్పందించి, సమాధానం ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా, స్టాలిన్, ఈ ఉదయం 10.15 గంటలకు ఓ ట్వీట్ పెట్టారు.
"తమిళనాడుకు చెందిన పలువురు చిరు వ్యాపారులు నిజామాబాద్ జిల్లా, బాల్కొండ, కిసాన్ నగర్ లో చిక్కుకున్నారు. వారందరికీ ఆహారం, ఆశ్రయం లేదు. దయచేసి మీరు కల్పించుకోవాలి. వారి వివరాల కోసం తమిళనాడు స్మాల్ వెండర్స్ డెవలప్ మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు రాసమురుగేశన్ ను 7397585802 నంబర్ లో సంప్రదించవచ్చు" అంటూ తెలంగాణ సీఎంఓకు, కేటీఆర్ కు దాన్ని పంపారు.
ఆపై 10.21 గంటలకు కేటీఆర్, ఈ ట్వీట్ కు సమాధానం ఇచ్చారు. "స్టాలిన్ సార్... వీ విల్ టేక్ కేర్... నా టీమ్ సమన్వయం చేసుకుంటుంది" అని పేర్కొన్నారు. ఈ రెండు ట్వీట్లూ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.