మరో ఛాన్స్ కొట్టేసిన ప్రియాంక జవాల్కర్

  • 'టాక్సీవాలా'తో హిట్ కొట్టిన ప్రియాంక 
  • తొలి సినిమాతోనే యూత్ లో మంచి క్రేజ్
  • కిరణ్ అబ్బవరం జోడీగా ఛాన్స్
తెలుగు తెరకి 'టాక్సీవాలా' సినిమాతో ప్రియాంక జవాల్కర్ పరిచయమైంది. తన నాజూకు సౌందర్యంతో ఈ సుందరి యూత్ హృదయాలను పట్టేసింది. 'టాక్సీవాలా' హిట్ కావడంతో ఈ అమ్మడు బిజీ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఎందుకనో అలా జరగలేదు. అభిమానులు మరిచిపోతున్న సమయంలో ఈ అమ్మాయి తెలుగులో మరో సినిమా చేయడానికి రెడీ అవుతోంది.

'రాజావారు రాణిగారు' సినిమాతో పరిచయమైన కిరణ్ అబ్బవరం హీరోగా ఒక సినిమా లాంచ్ అయింది. ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాతో, శ్రీధర్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. 'ఎస్ ఆర్ కల్యాణ మంటపం ఈస్ట్ 1975' అనే టైటిల్ ను సెట్ చేశారు. ఓ కల్యాణ మంటపం చుట్టూ తిరిగే కథ ఇది. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ కథలో, సాయికుమార్ .. తులసి ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.


More Telugu News