ఎల్పీజీ గ్యాస్ డెలివరీ సిబ్బంది ఎవరైనా ‘కరోనా’తో మరణిస్తే ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా

  • భారత చమురు సంస్థలు ఓ కీలక నిర్ణయం
  • ఐఓసీ, బీపీసీఎల్, హిందూస్థాన్ పెట్రోలియం ప్రకటన
  • ఎక్స్ గ్రేషియా మొత్తం ఒకేసారి చెల్లిస్తామన్న సంస్థలు
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉన్నప్పటికీ వైద్య, ఆరోగ్య, పోలీస్, పారిశుద్ధ్య సిబ్బంది, నిత్యావసర వస్తువులు అందించే వారి సేవలు తప్పనిసరి. ప్రస్తుతం కరోనా వైరస్ హడలెత్తిస్తున్న నేపథ్యంలో వారు తమ ప్రాణాలకు తెగించి సైతం విధుల్లో పాల్గొంటున్నారు. అదే కోవలోకి ఎల్ పీజీ గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసే డెలివరీ బాయ్ నుంచి సంబంధిత సిబ్బంది కూడా వస్తారు.

ఈ విషయమై ఆలోచించిన ఎల్పీజీ పంపిణీ సంస్థలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోలియం ఓ కీలక నిర్ణయం తీసుకున్నాయి. గ్యాస్ పంపిణీ చేసే డెలివరీ బాయ్స్, షోరూమ్  సిబ్బంది, గోడౌన్ కీపర్స్, మెకానిక్ లు ఎవరైనా ‘కరోనా’ సంబంధిత లక్షణాలతో ప్రాణాలు కోల్పోతే వారికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తామని ప్రకటించాయి. ఈ మొత్తాన్ని ఒకేసారి చెల్లిస్తామని అధికారిక ప్రకటన ద్వారా తెలిపాయి.


More Telugu News