రేషన్ ఇంటికే అందించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్నా: నారా లోకేశ్

  • ‘కరోనా’ విజృంభిస్తోంది.. ప్రజలను రేషన్ కోసం రోడ్లపై నిలబెట్టొద్దు
  • అలా నిలబెట్టడం అంత శ్రేయస్కరం కాదు
  • రేషన్ కోసం ఎండలో నిలబడ్డ వృద్ధురాలు మృతి బాధాకరం 
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలను రేషన్ కోసం రోడ్లపై నిలబెట్టడం అంత శ్రేయస్కరం కాదంటూ ఏపీ ప్రభుత్వానికి టీడీపీ నేత నారా లోకేశ్ సూచించారు. ఈ సందర్భంగా విశాఖలోని ద్వారకా నగర్ లో వృద్ధురాలు షేక్ మేరబీ మృతి చెందిన ఘటన గురించి ప్రస్తావించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. నెలకు రూ.400 కోట్ల ప్రజాధనంతో నడుస్తున్న వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటికే రేషన్ అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానంటూ లోకేశ్ వరుస ట్వీట్లు చేశారు.


More Telugu News